
వైభవంగా పంచరాత్ర ఉత్సవాలు
యలమంచిలి రూరల్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన యలమంచిలి పంచరాత్ర మహోత్సవాలు సోమవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఏటా దీపావళి నుంచి నాగులచవితి వరకు ఐదు రాత్రులు ఉత్సవాలను స్థానిక గవరపాలెం భూలోకమాంబ అమ్మవారు, పాతవీధి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ కమిటీలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలిరోజు సోమవారం అమ్మవారిని మహాలక్ష్మిగా, రెండోరోజు అమ్మవారిని బాలత్రిపురసుందరిగా అలంకరించారు. అమ్మవారితోపాటు పాతవీధి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుద్దీపాలతో సుందరంగా సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాల సెట్టింగ్‌లు

వైభవంగా పంచరాత్ర ఉత్సవాలు

వైభవంగా పంచరాత్ర ఉత్సవాలు