
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక
అనకాపల్లి టౌన్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఏఎంఏఎల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఏలూరులో ఈ నెల 22,23 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్ 19 అథ్లెటిక్స్ పోటీలకు ఎస్.తేజ, ఎల్.రమణమూర్తి, జి.నరేష్, ఎం. సిద్దు, బి.హరిణి పాల్గొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జయబాబు తెలిపారు. ఈ విద్యార్థులను కళాశాల యాజమాన్య అధ్యక్షుడు శ్రీధరాల కృష్ణ పేర్రాజు, కరస్పాడెంట్ పెంటకోట వెంకట రామారావు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎస్ నాయుడు అభినందించారు.