
చోడవరంలో సొంత ఇల్లు నిర్మాణానికి అమర్ శ్రీకారం
చోడవరం: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ చోడవరంలో తన సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పట్టణ పరిధిలో భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి స్థలాన్ని సోమవారం శుభ్రం చేయించారు. అమర్‌నాఽథ్‌ను పూర్తిస్థాయిలో చోడవరం నియోజకవర్గం సమన్వయకర్తగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నియమించడం, ఆయన కొంత కాలంగా నియోజకవర్గంలో ప్రజల తరపున ప్రజాసమస్యలపై అనేక ఆందోళన చేయడం, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో చోడవరంలోనే ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సొంత ఇంటితో పాటు ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఆయన పూర్తి స్థాయిలో తమకు అందుబాటులో ఉంటారని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకొని ప్రజలకు, కార్యకర్తలకు మరింత చేరు వగా ఉండి సేవచేయాలన్న సంకల్పంతో ఉన్నా నని ఈ సందర్భంగా అమర్‌నాథ్ తెలిపారు.