
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై రణభేరి
అనకాపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం నవంబర్ 22వ తేదీ వరకూ గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరుగుతుందని, కోటి సంతకాల అనంతరం గవర్నర్‌కు పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్‌ను సోమవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో నిర్మాణదశలో ఉన్న మెడికల్ కళాశాల పరిశీలనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అనకాపల్లి జాతీయ రహదారి మీదుగా కొత్తూరు, కశింకోట, తాళ్లపాలెం, బయ్యవరం మీదుగా మెడికల్ కళాశాలకు వెళ్లే సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టడం జరిగిందని స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం ఎంతో ఆనందానికి గురిచేసిందన్నారు. ఈనెల 28న నియోజకవర్గ స్థాయిలో ప్రచారం, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. మొదటి సంతకాన్ని మలసాల భరత్‌కుమార్, రెండో సంతకాన్ని పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ చేపట్టారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకురాలు శోభాహైమావతి, పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డేడ లక్ష్మీనరసింహం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు రత్నకుమారి, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, 80వ వార్డు ఇన్‌ఛార్జ్ కెఎం.నాయుడు, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, కాండ్రేగుల హైమావతి, మునూరు శ్రీనివాసరావు, బొడ్డేడ శివ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఉద్యమంలో భాగస్వాములు కండి
చోడవరం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాధ్ హెచ్చరించారు. చోడవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ ప్రచార వాల్ పోస్టర్లను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణలో ప్రజలంతా భాగస్వాములు అవ్వాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలు, విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని చూస్తుందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న యోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ పోరాటంలో భాగంగానే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అమర్‌నాఽథ్ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, గాడి అప్పారావు, గూనూరు రామచంద్రనాయుడు, గూనూరు రాజు, ఓరుగంటి నెహ్రూ, అప్పికొండ లింగబాబు, పోతల ప్రసాద్, బొడ్డు శ్రీరామూర్తి, సూరిశెట్టి నాగదుర్గ గోవింద, మొల్లి సోమునాయుడు, పందిరి శ్రీనివాసరావు, చవితిన బాబూరావు, శానాపతి సత్యారావు పాల్గొన్నారు.
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి
చోడవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో
కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ మంత్రి అమర్‌నాఽథ్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై రణభేరి