
స్విమ్మింగ్ పోటీల్లో వాడనర్సాపురం యువకుడి ప్రతిభ
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురానికి చెందిన యువకుడు స్విమ్మింగ్ పోటీల్లో రాణిస్తూ బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. మంగళగిరిలో ఈ నెల 12న మాస్టర్స్ ఆక్వాటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు వాడనర్సాపురానికి చెందిన యువకుడు మైలపల్లి శ్రీనివాస్ 7వ మాస్టర్స్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బ్రెంచ్ స్ట్రోక్‌లో బంగారు పతకం సాధించాడు. దీంతో వాడనర్సాపురానికి చెందిన వారంతా శ్రీనివాస్‌ను అభినందించారు.