
బల్క్‌డ్రగ్ పార్కును ఆపండి
7వ పేజీ తరువాయి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల బకాయిలు చెల్లించాలి
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా రైతులకు మొక్కజొన్న వేయమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని చైర్‌పర్సన్ ఆమోదించారు.
అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టు వద్దు
అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టును నిలుపుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు, చెట్టి రోష్మిణి డిమాండ్ చేశారు. అల్లూరి కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించడం విచారించదగిన విషయమన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. సెప్టెంబర్ 5న గిరిజన బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్‌కు ఆ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. హోంమంత్రి సొంత జిల్లాలో లైంగిక దాడులు జరుగుతున్నా.. చర్యలు తీసుకునే వారు లేరని ఆరోపించారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం ఎంత జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. యూరియా సరఫరా చేయడంలోనూ కూటమి విఫలమైందని ఆమె మండిపడ్డారు.

బల్క్‌డ్రగ్ పార్కును ఆపండి