
సహకార వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
చోడవరం: సహకార వ్యవస్థపై అధ్యక్షులంతా పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులందరికీ జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని చోడవరంలో శుక్రవారం నిర్వహించారు. డీసీసీబీ చైర్‌పర్సన్ కోన తాతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంఘాన్ని లాభాల్లో నడిపించే విధంగా పనిచేయాలన్నారు. ఎక్కువగా రైతుల భాగస్వామ్యం ఈ సంఘాల్లో ఉంటుంది కాబట్టి వారికి అన్ని విధాలుగా సేవలు అందించాలన్నారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్‌ఎన్‌ఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, డీసీసీబీ జీఎం వర్మ, తదితరులు పాల్గొన్నారు.