
అమర్‌ను కలిసిన రాజయ్యపేట మత్స్యకారులు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలపాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను మత్స్యకారులు కోరారు. ఈ మేరకు బుధవారం నక్కపల్లి మండలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సీరం నర్సింగమూర్తి, ఉపాధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో రాజయ్యపేట మత్స్యకార సంఘం పెద్దలు.. అమర్‌నాథ్‌ను గాజువాక సమీప మిందిలో కలిసి వినతి పత్రం అందజేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు.
నిరాహార దీక్షకు మద్దతు
రాజయ్యపేటలో మత్స్యకారుల దీక్షకు 33 గ్రామాల సంఘాల అధ్యక్షుడు చొక్కా అప్పారావు మద్దతు ప్రకటించారు. బుధవారం శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం స్పందించి బల్క్ డ్రగ్స్ పార్క్‌ను రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 33 సంఘాల నాయకులు యజ్జల సూరిబాబు, యజ్జల రాజు, బోదిన నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, నాయకులు పిక్కి తాతీలు, గోసల సోమేశ్వరరావు, చొక్కా కాశీ, చేపల సోమేశ్, ఎం.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
కన్‌స్ట్రక్షన్ కంపెనీకి
వినియోగదారుల కమిషన్ షాక్
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఫార్మా ఉద్యోగి మృతి