
నక్కపల్లిలో స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ల పర్యటన
నక్కపల్లి హాకీ క్లబ్‌లో క్రీడాకారులతో
మాట్లాడుతున్న స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్లు
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్లు ఎం.వి.రమణారావు, పేరం రవీంద్రనాథ్, కొవ్వాసు జగదీశ్వరీ బృందం సభ్యులు మంగళవారం నక్కపల్లిలో పర్యటించారు. ఇక్కడున్న హాకీ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. నక్కపల్లిలో హాకీ క్రీడాకారులకు అద్భుతమైన శిక్షణ ఇస్తున్న కోచ్‌లను అభినందిస్తున్నామన్నారు. అనంతరం బీఎస్ హాకీ క్లబ్ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. క్లబ్ ఫౌండర్ బలిరెడ్డి సూరిబాబు, అధ్యక్షుడు చిన్న అప్పారావు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ, మాజీ సీనియర్ క్రీడాకారుడు రామచంద్రరావు, కోచ్ రాంబాబు, నానాజీ, శ్రీను, రంజిత్ పాల్గొన్నారు.