దళిత రైతులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన లారీలు
మాకవరపాలెం: నల్లరాయి తరలిస్తున్న లారీలను దళిత రైతులు అడ్డుకున్నారు. జి.కోడూరు రెవెన్యూలోని 332 సర్వే నంబర్‌లో నిర్వహిస్తున్న క్వారీ కారణంగా సమీపంలో ఉన్న భూములకు నష్టం వాటిల్లుతుందని, ఈ క్వారీ అనుమతులు రద్దు చేయాలని దళిత రైతులు గత 14 రోజులుగా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి క్వారీ నుంచి రాయిని తరలిస్తున్న నాలుగు లారీలను వారు అడ్డుకున్నారు. తమకు నష్టం కలిగించే క్వారీ నిర్వహించేందుకు వీల్లేదని వారు స్పష్టం చేశారు.