
గో భక్షకులు
గో సంరక్షకులుగా బిల్డప్ ఇస్తారు.. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుంటారు. పోలీసులకు అప్పగించి ఆ ఆవులను అధికారికంగానే చారిటబుల్ ట్రస్ట్ గోశాలకు తరలిస్తారు. ట్రస్ట్ ముసుగులో పశువులను ఇక్కడ నుంచి వ్యాన్లలో హైదరాబాద్‌కు తరలించి పశువధ చేసే వ్యాపారులకు విక్రయిస్తారు. టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు ట్రస్టుగా ఏర్పడి చేస్తున్న దారుణమిది. దీనిపై ఎస్.రాయవరానికి చెందిన సోమిరెడ్డి వెంకట అప్పలసత్యసన్యాసి నూకరాజు లోకాయుక్తకు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలకు ఫిర్యాదు చేశారు.
రక్షకులు కాదు..
విజయవాడలో ఉన్న యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గుర్తింపు పత్రం
హైవేపై రవాణా చేసేవారే టార్గెట్..
అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో వాహనాల్లో పశువుల రవాణా నిర్భయంగా సాగుతోంది. ఈ రవాణాదారులనే లక్ష్యంగా చేసుకొని ట్రస్టు ముసుగులో పశువులను రక్షిస్తామని స్వాధీనం చేసుకుంటున్నారు. అదే తప్పు దర్జాగా వీరు కూడా చేస్తున్నారు. ఒక్కో వాహనంలో 20 నుంచి 40 వరకు పశువులను తాళ్లతో బంధించి అతి క్రూరంగా వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేల పెద్ద ఎత్తున అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వ్యాన్‌లో గోవులను తరలిస్తున్న దృశ్యం
సాక్షి, అనకాపల్లి:
దొంగలకు దొంగ.. ఘరానా దొంగ.. ఇలా ఎన్ని పేర్లతోనైనా వీరిని పిలుచుకోవచ్చు. రక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు అధికారుల కళ్లుగప్పి అక్రమార్జనకు తెరలేపారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో వీరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఏపీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అక్రమ మార్గంలో రికగ్నిషన్ సర్టిఫికెట్ పొంది గోశాలను నడుపుతున్నారు. జాతీయ రహదారిలో గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని వాటిని పోలీసులు అప్పగించి ఆ ఆవులను చారిటబుల్ ట్రస్ట్‌కు తరలించుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే గోవులను కొనుగోలు చేసుకుని ఇక్కడకు తీసుకొస్తారు. రక్షణ చారిటబుల్ ట్రస్ట్ ముసుగులో హైదరాబాద్‌లో పశువధ చేసే వ్యాపారుల ‘కొట్టాయి’కి వ్యాన్లలో ఆవులను తరలిస్తున్నారు. ఎస్.రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేవుపల్లి, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి టీడీపీ నాయకుల అండదండలతో పెనుగొల్లు గ్రామంలో డోర్ నెం.2–8/2 అడ్రస్‌తో ‘రక్షణ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు.
పశు రవాణా నిబంధనలేమిటంటే..
పాడి పశువులు, ఆవులు, దూడలు, ఎద్దులను వధించడంపై మన దేశంలో నిషేధం విధించినప్పటికీ యథేచ్ఛగా వధశాలలకు పశువులను తరలించడం నిత్యకృత్యంగా మారింది. వీటి తరలింపునకు ప్రత్యేక నిబంధనలున్నాయి. మూగజీవాలను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు జీవాలను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కలిగి ఉండాలి. పశువుల రవాణా సమయంలో మూగజీవాలకు సరిపడా గాలి, మేత, నీరు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలి. పెద్ద వాహనాల్లో పశువులను తరలించేటప్పుడు ఒక పశువు కోసం రెండు స్క్వేర్ మీటర్ల వంతున విడివిడిగా అరలను తయారుచేసి అందులో పశువులను తరలించవలసి ఉంటుంది. గూడ్స్ వాహనాల్లో పశువులను తరలించినా, పరిమితికి మంచి మూగజీవాలను తరలించినా భారీ జరిమానాతో పాటు తరలించే వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.
ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు
రక్షణ చారిటబుల్ ట్రస్ట్ పేరిట పశువుల అక్రమ రవాణా
ఇక్కడ నుంచి వ్యాన్లలో హైదరాబాద్ ‘కొట్టాయి’కి తరలింపు
వారాంతపు సంతలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్న అక్రమార్కులు
ఈ ఏడాది పది వాహనాల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వైనం
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
పవిత్రంగా భావించే గోవులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థ ముసుగులో వివిధ స్టేషన్లలో పోలీసులు పట్టుకున్న ఆవులు, ఏజెన్సీ ప్రాతం నుంచి వచ్చిన ఆవులు, పశువులు, తమ సంస్థ షెడ్‌కు పెద్ద సైజు వ్యానుల్లో తరలిస్తుంటారు. అక్కడ నుండి చిన్న సైజు వాహనాల్లో అనకాపల్లి బోర్డర్ తుని వరకు ట్రస్టు పేరుతో పంపిస్తారు. అక్కడ నుంచి వేరే వ్యక్తులు హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. కొన్ని ఆవులు తిండి లేక, అనారోగ్యంతో, తరలింపు సమయంలో గాయాల పాలై మృతి చెందుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవలే పోలీసులు 10 మందికి పైగా పశువుల అక్రమ రవాణా చేసే వారిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఆ ఆవులను ఈ సంస్థకే తరలించారు.
– సోమిరెడ్డి వెంకట అప్పలసత్యసన్యాసి నూకరాజు, ఎస్.రాయవరం

గో భక్షకులు

గో భక్షకులు

గో భక్షకులు

గో భక్షకులు

గో భక్షకులు