
ప్రజల్లోకి బాబు మోసాలు
నక్కపల్లి: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిలదీసేలా చైతన్యం తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. సోమవారం నక్కపల్లి సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరక్టర్ వీసం రామకృష్ణ అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కంబాల జోగులు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసి మరీ కూటమి నేతలు హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమాట నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. కూటమి పార్టీలు ఇచ్చిన బాండ్లు, మేనిఫెస్టోలను ఆన్‌లైన్‌లో ఉంచి ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. తల్లికి వందనం పథకం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి అందలేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా అర్హులందరికీ రాలేదన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి భ్రమగానే మిగిలాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలన్నారు. రెండు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం అతితక్కువ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు.
దేవవరం నుంచి శ్రీకారం
వీసం రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15 దాటిన తర్వాత దేవవరం నుంచి మొదలు పెడతామన్నారు. పరిశ్రమలకు భూములిచ్చిన నిర్వాసిత రైతులకు పరిహారం, ప్యాకేజీ విషయంలో పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు అయినంపూడి మణిరాజు, పొడగట్ల పాపారావు, మహిళా విభాగం కార్యదర్శి తుమ్మా కల్పన, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ బాబా, సర్పంచ్‌లు గొర్ల నర్సింహమూర్తి, రోహిణి, అల్లు రమణ, వియ్యపు శ్రీను, పి.వెంకటేష్, వెదుళ్ల రమణ, ఎంపీటీసీ సభ్యులు లొడగల చంద్రరావు, గంటా తిరుపతిరావు, గొర్ల గోవిందు, నిట్ల గోవిందు, బచ్చలరాజు, ఉప సర్పంచ్ వేగేశ్న చంటి తదితరులు పాల్గొన్నారు.
నిలదీసేలా చైతన్యం తీసుకురావాలి
‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సమన్యయకర్త కంబాల జోగులు