
స్పెషల్ ఒలింపిక్స్ విజేతకు అభినందన
బాల సరస్వతిని అభినందిస్తున్న జిల్లా సమగ్ర శిక్ష పీవో డాక్టర్ జయప్రకాష్
అనకాపల్లి టౌన్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాస్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ బోసి బాల్ గేమ్ క్రీడా పోటీలలో గెలుపొందిన దివ్యాంగ విద్యార్థిని బాల సరస్వతిని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ జయప్రకాష్ అభినందించారు. స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆమెను సత్కరించారు. రావికమతం మండలం చిన గుమ్ములూరు కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాల సరస్వతి బాల్‌గేమ్ పోటీలలో నాలుగో స్థానం సాధించడం పట్ల జిల్లా సహిత విద్య సమన్వయ అధికారి బి.ఆర్.వి.రామకృష్ణ నాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని శకుంతల తదితరులు అభినందించారు.