
10న తాండవ నీటి విడుదల
నాతవరం: ఖరీఫ్ సాగు కోసం తాండవ రిజర్వాయరు నీటిని ఈ నెల 10న విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాండవ రైతులు, ప్రజాప్రతినిధుల ప్రాజెక్టు కమిటీ చైర్మన్, సభ్యుల అభీష్టం మేరకు నీటిని విడుదల చేసే తేదీ ఖరారు చేశామన్నారు. స్పీకరు అయ్యన్నపాత్రుడు తాండవ రిజర్వాయరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారన్నారు. ప్రాజెక్టులో సోమవారం సాయంత్రానికి 371.1 అడుగులు ఉందన్నారు. తాండవ ప్రమాద స్థాయి నీటి మట్టం 380.0 అడుగులు కాగా.. డేడ్ స్టోరేజీ నీటి మట్టం 345 అడుగులుగా పరిగణిస్తామన్నారు. తాండవ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని రెండు కాలువలు ద్వారా రోజు ఒక్కంటికి 500 క్యూసెక్కులు చొప్పున 70 రోజులు ఆయకట్టుకు ప్రవహిస్తుందన్నారు. ఈలోపు వర్షాలు కురిసి నీటి మట్టం పెరిగితే ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు.