
ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి సోమవారం 31 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుహిన్‌సిన్హా మాట్లాడుతూ భూ తగాదాలు–16, కుటుంబ కలహాలు–6, ఇతర విభాగాలకు చెందినవి–9 అర్జీలు వచ్చాయని చెప్పారు. చట్టపరిధిలో సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు దిగువ స్థాయి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్‌ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.