ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోనే అడుగులు మహానేత మరణంతో కుంటుపడిన అభివృద్ధి వైఎస్‌ జగన్‌ హయాంలో పరుగులు నేడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోనే అడుగులు మహానేత మరణంతో కుంటుపడిన అభివృద్ధి వైఎస్‌ జగన్‌ హయాంలో పరుగులు నేడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి

Jul 8 2025 4:58 AM | Updated on Jul 8 2025 5:00 AM

కొన్ని లక్షల జీవితాలను మార్చిన ఒకే ఒక సంతకం

మంచితనానికి మరో పేరు, మానవత్వానికి ప్రతిరూపం, చిరునవ్వుకు చిరునామా, అచ్చతెలుగు పంచెకట్టుకు వన్నె తెచ్చిన రైతు బాంధవుడు, తెలుగుదనానికి నిండైన రూపం.. ఆయనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన మదిలో మెదిలితే రైతన్నకు కొండంత ధైర్యం. అక్కాచెల్లెమ్మలకు భరోసా.. విద్యార్థి లోకానికి ‘నేనున్నానంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించిన అనుభూతి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసి జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు ఆయన అందించిన అభివృద్ధి ఫలాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. మంగళవారం రాజన్న జయంతి సందర్భంగా ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తుచేసుకుందాం.

– సాక్షి, విశాఖపట్నం

ఐటీకి ఆద్యుడు

విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలని వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సంకల్పించారు. దీనికోసం నగరంలోని మూడు కొండల కింద ఉన్న 100 ఎకరాల ప్రాంతాన్ని గుర్తించి, కనీసం 100 ఉద్యోగాలు కల్పించే ఐటీ కంపెనీలకు మౌలిక సదుపాయాలతో ప్లాట్లు అందించారు. దాదాపు 200 కంపెనీలు ముందుకురాగా, 70 శాతం కార్యకలాపాలు ప్రారంభించాయి. సత్యం, విప్రో వంటి పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ శాఖలను విస్తరించాయి. వైఎస్సార్‌ మరణానంతరం విశాఖ ఐటీ ప్రగతి కుంటుపడింది. టీడీపీ హయాంలో కంపెనీలకు రాయితీలు అందకపోవడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయి. సుమారు పదేళ్ల పాటు విశాఖ ఐటీ రంగం స్తంభించిపోయింది. 2019లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం, ఐటీ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహం, అదానీ డేటా సెంటర్‌ శంకుస్థాపన వంటి చర్యలతో తిరిగి ఐటీ అభివృద్ధి పుంజుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఐటీ అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమైంది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి విశాఖ జిల్లా తీవ్ర సంక్షోభంలో ఉంది. తాగునీటి సమస్య, అచ్యుతాపురం సెజ్‌, పరవాడ ఫార్మాసిటీ, గంగవరం పోర్టు భూసేకరణ వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. అలాగే స్టీల్‌ప్లాంట్‌, బీహెచ్‌పీవీ, షిప్‌యార్డులు నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 2005 జనవరిలో వైఎస్సార్‌ విశాఖలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విశాఖ నగరంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అచ్యుతాపురం, ఫార్మా సెజ్‌లకు భూముల ధరలు నిర్ణయించి, పునరావాస ప్యాకేజీలు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను గట్టెక్కించి, రెండో దశ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. బీహెచ్‌పీవీని బీహెచ్‌ఈఎల్‌లో విలీనం చేయాలని, షిప్‌యార్డు ను రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవింపచేయాలని నిర్ణయించారు.

గ్రేటర్‌ హోదా కల్పన

న్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహా విశాఖ ప్రతిపాదనలకు వైఎస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే కార్యరూపం ఇచ్చారు. 2005 నవంబర్‌ 22న విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు గ్రేటర్‌ హోదా కల్పించారు. దీంతో విస్తీర్ణం 111 చ.కి.మీ. నుంచి 540 చ.కి.మీ.లకు పెరిగింది. వైఎస్సార్‌ మరణానంతరం జీవీఎంసీ వార్డుల విస్తరణ నిలిచిపోయింది. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 10 పంచాయతీలను విలీనం చేసి, జీవీఎంసీని ప్రస్తుతం 98 వార్డులుగా విస్తరించారు.

దేశంలోని టాప్‌ నగరాల్లో విశాఖ ఒకటిగా...

వైఎస్సార్‌ చొరవతో విశాఖ జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కిందకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలైన 63 నగరాల్లో వైజాగ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా విశాఖకు రూ.1885 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. బీఆర్‌టీఎస్‌ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థతో సహా 20కి పైగా కీలక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి.

గోడు చెప్పిన వారందరికీ గూడు

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో వైఎస్సార్‌ రాజీవ్‌ గృహకల్ప పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసి, నగర పరిధిలో లక్షకు పైగా పునరావాస కాలనీలను నిర్మించారు. రాజీవ్‌ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా రూ.600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్లు నిర్మించారు.

యువతకు ఉపాధి.. భవితకు పునాది

2008 జనవరి 2న వైఎస్సార్‌ ఉపాధి పథకాన్ని ప్రారంభించి, యువతకు 13 అంశాల్లో శిక్షణ ఇచ్చి, 70 శాతం ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం ఈ పథకానికి గ్రహణం పట్టింది. చంద్రబాబు హయాంలో నిరుద్యోగం పెరిగింది. తిరిగి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలను అందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో కాలయాపన చేస్తోంది.

అంతర్జాతీయ హోదా ఆయన ఘనతే

రూ.100 కోట్లు ఖర్చు చేసి విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. దీంతో అంతర్జాతీయ సర్వీసులు పెరిగాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలనలో రాయితీలు నిలిపివేయడంతో సర్వీ సులు రద్దయ్యాయి. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కార్గో సర్వీసులు కూడా మొదలయ్యాయి. ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖ విమాన సర్వీసులపై సవతితల్లి ప్రేమ కురిపిస్తోందని ఆరోపణలున్నాయి.

విమ్స్‌ ఏర్పాటుకు శ్రీకారం

త్తరాంధ్ర ప్రజలకు నిమ్స్‌ తరహా వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైఎస్సార్‌ 2006లో విమ్స్‌ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. రూ.250 కోట్లతో 2007లో శంకుస్థాపన జరిగి, 2009 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం పనులు మందగించాయి. చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌ను ప్రైవేటుపరం చేయాలని ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ అడ్డుకుంది. అనంతరం వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధితో ప్రస్తుతం విమ్స్‌ ఉత్తరాంధ్రలో పెద్ద ఆస్పత్రిగా భాసిల్లుతోంది.

ఏలేరు నీటిని తీసుకొచ్చింది రాజన్నే...

గోదావరి జలాలను విశాఖ, ఉత్తరాంధ్ర అవసరాలకు మళ్లించే లక్ష్యంతో వైఎస్సార్‌ పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా, ఏలేరు నీటిని మళ్లించడం ద్వారా స్టీల్‌ప్లాంట్‌కు ఎదురయ్యే నీటి సమస్యను పరిష్కరించారు. ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు.

గిరిజనానికి బాసటగా..

విశాఖ ఏజెన్సీలో కాఫీ ప్లాంటేషన్‌ ప్రాజెక్టును వైఎస్సార్‌ తీసుకొచ్చి, రూ.144 కోట్లు కేటాయించి 60 వేల మంది గిరిజనులకు ఉపాధి కల్పించారు. పోడు వ్యవసాయాన్ని నేరంగా భావించే కాలంలో, వైఎస్సార్‌ 2009 జులై 12న అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గిరిజనులకు హక్కు పత్రాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం భూ పంపిణీ జరగలేదు. తిరిగి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు అందజేశారు.

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన1
1/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన2
2/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన3
3/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన4
4/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన5
5/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన6
6/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన7
7/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన8
8/8

ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్‌ హయాంలోన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement