
సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు
● కలెక్టర్ విజయకృష్ణన్ ● పశుగ్రాస వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
అనకాపల్లి: జిల్లాలో ఈ నెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలలో రైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, జొన్న, మొక్కజొన్న, పిల్లి పెస ర పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో సో మవారం పశుగ్రాస వారోత్సవాల వాల్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రతి గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో పచ్చి మేత ప్రాముఖ్యత, శాసీ్త్రయ పద్ధతిలో పశుగ్రాసం పెంచే విధానాలు, పశుగ్రాసం నిల్వ చేసే పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఐదు నుంచి ఆరు లీటర్లు పాలిచ్చే పశువులను పచ్చి మేతతోనే పోషించవచ్చన్నారు. పచ్చిమేతలో విటమిన్ ఏ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదకురా వడంతో పాటు పాల దిగుబడి బాగా పెరుగుతుందన్నారు. పశుగ్రాసాలను అన్ని ప్రాంతాల్లో అన్ని మాసాల్లో సాగు చేయవచ్చన్నారు. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చని చెప్పారు. వరి కో సిన తరువాత భూమిలో ఉండే తేమతో జనుము, పిల్లి పెసర సాగు చేసుకోవచ్చన్నారు. జొన్న రకాలను 50 శాతం పూత దశలో తప్పక కోయాలని, లేత దశలో కోస్తే హైడ్రోసైనిక్ యాసిడ్ అనే విష ప దార్థం విడుదలై హాని కలిగిస్తుందని సూచించారు. డీఆర్వో సత్యనారాయణరావు, కేకేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుబ్బలక్ష్మి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రామ్మోహనరావు పాల్గొన్నారు.