
నేడు వైఎస్సార్ జయంతి
● సేవా కార్యక్రమాలతో ఘన నివాళి అర్పించాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ పిలుపు
చోడవరం:
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చోడవరం నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైఎస్సార్‌కు నివాళులు అర్పించడంతోపాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.