
పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు
పశువైద్యాధికారులతో మాట్లాడుతున్న జిల్లా పశువైద్యశాఖ అధికారి రామ్మోహనరావు
అనకాపల్లి: పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్టు జిల్లా పశువైద్యశాఖ అధికారి డాక్టర్ వి.రామ్మోహనరావు తెలిపారు. ఆదివారం జునోసిస్ డే వేడుకలను పురస్కరించుకుని స్థానిక గాంధీనగరం జిల్లా ఆస్పత్రి ఆవరణలో శనివారం జిల్లాలో అన్ని మండలాలకు చెందిన పశు వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు తదితరులు పాల్గొన్నారు.