
ఇన్‌చార్జి ఎంపీపీగా గోవిందరావు ప్రమాణస్వీకారం
ఎస్.రాయవరం: స్థానిక ఇన్‌చార్జి ఎంపీపీగా బొలిశెట్టి గోవిందరావు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఎంపీపీగా ఎన్నికై న కేసుబోయిన వెంకటలక్ష్మి వ్యక్తిగత కారణాలతో ఇటీవల రాజీమానాచేయడంతో ఆమె స్థానంలో వైస్ ఎంపీపీ గోవిందరావుకు ఇన్‌చార్జ్ ఎంపీపీగా బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంబాల జోగులు , మండలంలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు గోవిందరావుకు అభినందనలు తెలిపారు. దుశ్శాలువాలు, పుష్పగుచ్ఛాలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంబాల జోగులు మాట్లాడుతూ గోవిందరావు మండల ప్రజల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారు. కూటమినేతలు ప్రలోభాలకు గురిచేసినా ఎస్.రాయవరం మండలం వైఎస్సార్ సీపీ శ్రేణులు ఐక్యతతో ఉన్నారంటే దానికి కారణం బొలిశెట్టి గోవిందరావునేనని చెప్పారు. అంతకుముందు గోవిందరావు మాట్లాడుతూ కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అనంతరం కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ గోవిందురావును సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాకర దేవి, సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు కర్రి సత్యనారాయణ,సర్పంచ్‌లు ధూళి శ్రీనివాసరావు, శానాపతి శ్రీరాములు, పాలపర్తి పాపారావు, కోశెట్టి వెంకటరమణ,గాడి అప్పలనరసింహా,భూపతి అప్పారావు, చోడిపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు బాలం సూరిబాబు,శానాపతి రాము, కేసుబోయిన వెంకటలక్ష్మి,బైపా శ్రీనివాసరావు,వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువర్మ, జిల్లా కమిటీ సభ్యులు కొణతాల శ్రీనివాసరావు,మండల యూత్ అధ్యక్షుడు నల్లపరాజు వెంకటరాజు,నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, అల్లాడ నాగరాజు,చేకూరి శ్రీరామచంద్రరాజు, దాట్ల రామురాజు,శిగటాపు జోగిరాజు, ఇళ్ల సత్యనారాయణ,వియ్యపు రమణ,వెలగా శ్రీనివాసరావు,చొప్పా రాజు, గుర్రం నానాజీ,కాసెపు అప్పన్న,కర్రి శ్రీను, ఉద్దడం సూర్యనారాయణ,అద్దేపల్లి బొజ్జన్న, నాగంబోయిన శ్రీనివాసరావు,శేషు,బొండా దివాణం,మందగుదుల వెంకటరమణ, ,కనికళ్ల అమ్మాజి, కర్రి వరహాలరావు,పిట్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌చార్జి ఎంపీపీగా గోవిందరావు ప్రమాణస్వీకారం