
స్వయం సహాయక బృందాల బలోపేతమే లక్ష్యం
● సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి ● సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి: స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయా లని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గ్రూపు సభ్యులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కలెక్టరేట్‌లో గురువారం గ్రామీణ అభివృద్ధి సంస్థ సూక్ష్మ రుణాల ప్ర ణాళిక అమలుపై జిల్లా స్థాయి సహకార బృందాలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయిల్లో కమిటీలు వేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. పది రోజుల్లో గ్రౌడింగ్ పని పూర్తి చేయాలని చెప్పారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు డిజిటలైజేషన్‌లో భాగంగా బయోమెట్రిక్ ప్రమాణీకంగా లబ్ధి చేకూర్చనున్నట్టు ఆమె తెలిపారు. సూక్ష్మ సంస్థలకు మద్దతు ద్వారా స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం ఈ ప్రణాళిక లక్ష్యమన్నారు. డీఆర్‌డీఎ పీడీ శచీదేవి, వ్యవసాయం, ఉద్యానవనం, పట్టుపురుగుల పెంపకం, పశుసంవర్థకం, మత్స్య సంపద, పరిశ్రమలు శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజరు, తదితరులు పాల్గొన్నారు.