
ప్రయాణం.. నరకప్రాయం
నాతవరం: మండల కేంద్రం నాతవరం నుంచి తాండవ రిజర్వాయర్ వరకు గల, రెండు జిల్లాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. ఫలితంగా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం ఎనిమిది కిలోమీటర్ల ఈ రోడ్డులో అడుగడుగునా ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఏ మాత్రం వర్షం పడినా నీరంతా గోతుల్లోకి చేరడంతో ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గొయ్యి ఉందో తెలియక వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.ఈ తారు రోడ్డు పూర్తిగా శిథిలమై మట్టి రోడ్డును తలపిస్తోంది. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలానికి అనుసంధానం చేసే ప్రధాన రోడ్డు . నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాలను కలిపే ఈరోడ్డుపై మూడు మండలాల పరిధిలో సుమారు 25పైగా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లాలో ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్‌కు వెళ్లేందుకు ఈరోడ్డే కీల కం. రిజర్వాయర్‌ను సందర్శించేందుకు వచ్చిన వారితో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రోడ్డు అధ్వానంగా తయారవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
రాత్రి వేళ ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు శిథిలం కావడంతో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనదారులు ఈ ప్రాంతంలో గ్రామాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈచుట్టు పక్కల గ్రామాల్లో విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి అవస్థలకు గురవుతున్నారు. రోడ్డుకు కనీస స్థాయిలో మరమ్మతులు చేయకపోతే ఆర్టీసీ సర్వీసును నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నారు. గోతుల కారణంగా అత్యవసర సరీసులైన 108 వాహనం, ఇతర ప్రైవేటు అంబులెన్స్‌లు సైతం ఈ గ్రామాలకు సరిగా రావడం లేదు.
అడుగుకో గుంతతో అధ్వానంగా నాతవరం–తాండవ రోడ్డు
అవస్థలు పడుతున్న మూడు మండలాల ప్రయాణికులు
అడుగడుగునా గోతులు.. కనుచూపు మేర కనిపించని తారు..చిన్నపాటి వర్షానికే దమ్ము చేసే పొలంలా ఉండే దారి వెరసి తాండవ– నాతవరం రహదారి. ఈ రోడ్డులో ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. ఈ దారిలో ప్రమాణమంటేనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.

ప్రయాణం.. నరకప్రాయం