
విద్యార్థులకు పట్టాభిరామ్ సూచనలు అమూల్యం
పట్టాభిరామ్‌ను జ్ఞాపికతో సత్కరిస్తున్న మాజీ వీసీ ముర్రు, ఖాసిమ్ (ఫైల్)
కె.కోటపాడు : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ మృతి పట్ల అయ్యన్న విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె.ఖాసిమ్ సంతాపం తెలిపారు. తమ విద్యాసంస్థలతో పట్టాభిరామ్‌కు మంచి అనుబంధం ఉందని తెలిపారు. గతంలో ఇక్క పదో తరగతి విద్యార్థులకు పరీక్షలంటే భయాందోళనలను తొలగించి మానసికంగా సిద్ధం చేసేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అమూల్యమైన సూచనలు అందించారని తెలిపారు. పట్టాభిరామ్ మృతి పట్ల ఖాసిమ్‌తో పాటు రాజమండ్రి నన్నయ యూనివర్శిటీ విశ్రాంత వైస్ చాన్స్‌లర్ ముర్రు ముత్యా లనాయుడు సంతాపాన్ని ప్రకటించారు.