
చీటీల పేరుతో మోసం
● కె.కోటపాడు పోలీసులకు బాధితుల ఫిర్యాదు ● చౌడువాడలో ఘటన
కె.కోటపాడు : చీటీల పేరుతో సుమారు రూ.4 కోట్ల మేర మోసం చేసిన ఘటన మండలంలోని చౌడువాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి పెదిరెడ్డి పద్మజతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల వద్ద తాము మోసపోయామంటూ బాధితులు గురువారం కె.కోటపాడు పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ ధనుంజయ్‌తో బాధితుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చౌడువాడ గ్రామానికి చెందిన పెదిరెడ్ల పద్మజ 2016 నుంచి చీటీలు నిర్వహిస్తోంది.
ఆమె వద్ద చౌడువాడతో పాటు గరుగుబిల్లికి చెందిన సుమారు 200 మంది లక్షల్లో చీటీలు కట్టారు. చీటీలు పాడుకున్న వారిలో కొంత మందికి చెల్లింపులు జరపగా, మరికొందరు వడ్డీ డబ్బులకు ఆశపడి ఆమె వద్దనే చీటీ డబ్బులు ఉంచేవారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి పద్మజతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు కనిపించడం లేదు. దీంతో చీటీలు కట్టిన 200 మంది మోసపోయామంటూ కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.