
విత్తనాల పంపిణీలో రాజకీయం
వడ్డాదిలో వేర్వేరుగా అందించిన టీడీపీ నేతలు
బుచ్చెయ్యపేట: రైతులకు వరి విత్తనాల పంపిణీలో కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు. వడ్డాది రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం రైతులకు సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ చేపట్టారు. ముందుగా గ్రామానికి చెందిన రాష్ట హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, టీడీపీ ముఖ్య నాయకులు దొండా నరేష్, సయ్యపురెడ్డి మాధవరావు, ఇంటి అప్పారావు, తలారి శంకర్, కనక, మేడివాడ రమణ, ముత్యాల సూరిబాబులతో కలిసి వరి విత్తనాలు పంపిణీ చేశారు. తరవాత ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు వర్గీయులు మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దొండా సన్యాసిరావు, కూటమి నేతలు దొండా గిరిబాబు, కోరుకొండ సూరి అప్పారావు, సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, దొండా నానాజీ, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, సింగంపల్లి రమేష్‌లతో కలిసి వరి విత్తనాలు పంపిణీ చేశారు. కూటమి నేతల వర్గ విభేదాల కారణంగా విత్తనాల కోసం వచ్చిన రైతులతో పాటు సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి ఇతర అధికారులు ఇబ్బందులు పడ్డారు.

విత్తనాల పంపిణీలో రాజకీయం