
విద్యార్థులను ఇబ్బంది పెట్టడంలో రికార్డు
యోగాంధ్ర పేరుతో రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టడంలో చంద్రబాబు రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం తీసేశారు. ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి..ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు చేరేలా కుయుక్తులకు పాల్పడుతున్నారు. నారాయణ, చైతన్యలాంటి పైవేట్ విద్యాసంస్థలకు లాభం చేకూరేలా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. పేద విద్యార్థులకు ప్రోత్సాహం కరువైంది.
–బొడ్డపాటి హేమంత్‌కుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు