
విభిన్న ప్రతిభావంతుడికి త్రిచక్ర వాహనం వితరణ
తుమ్మపాల: పరిశ్రమలు సేవా దృక్పథంతో సమాజ సేవకు ముందుకు రావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. అచ్యుతపురం సెజ్‌లోని టొయోట్సా రేర్ ఎర్త్ జపాన్ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన త్రిచక్ర హోండా యాక్టివ్ వాహనాన్ని కలెక్టరేట్ వద్ద శుక్రవారం తూర్రి రవి అనే దివ్యాంగుడికి కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆమె అందజేశారు. కలెక్టర్ వినతి మేరకు రావికమతం మండలం రోచుపణుకు గ్రామనికి చెందిన రవికి ఈ వాహనం అందించినట్టు కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సుధాకర్, కంపెనీ క్వాలిటీ కంట్రోల్ హెడ్ ఆర్.రవికుమార్ పాల్గొన్నారు .