
పోలీస్ శాఖకు దివీస్ డ్రోన్లు
విశాఖ సిటీ: దివీస్ ల్యాబ్స్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విశాఖ నగర పోలీస్ శాఖకు రెండు అత్యాధునిక డ్రోన్‌లను అందజేసింది. ఈ డ్రోన్‌లను సీపీ శంఖబ్రత బాగ్చికి అందజేశారు. ఈ డ్రోన్‌లలో హెచ్చరికలు, సూచనలు చేసే లౌడ్‌స్పీకర్, డే అండ్ నైట్ విజన్ కెమెరా, 5 కిలోమీటర్ల పరిధి, 45 నిమిషాలకు పైగా ఎగిరే సమయం, డిటెక్షన్, రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్, లైవ్ స్ట్రీమింగ్ కనెక్టివిటీ, సెర్చ్‌లైట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు దివీస్ జీఎం వై.ఎస్.కోటేశ్వరరావు, లైజన్ కన్సల్టెంట్ ఎం.ఎన్.వరహాలరెడ్డి, సీఎస్‌ఆర్ మేనేజర్ డి.సురేష్‌కుమార్ పాల్గొన్నారు.