మాడుగులలో గీత కార్మిక షాపు తనిఖీ చేస్తున్న ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్, తదితరులు
మాడుగుల: వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.రాజశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం ధ్వంసం చేశామని స్థానిక ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ తెలిపారు. అంతకు ముందు గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులు నిబంధనలు ప్రకారం ఉన్నాయా? లేదా? అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ మాట్లాడుతూ 22 ఐడీ కేసుల్లో పట్టుబడిన 144.25 లీటర్లు, ఐఎంఎల్ 26 కేసుల్లో 47.7 లీటర్లు, ఎన్‌డీపీఎల్ కేసులో పట్టుబడిన 7.44 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశామన్నారు.