
చోడవరం బార్ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
చోడవరం: న్యాయవాదుల సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులంతా కొత్త అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ ఆధ్వర్యంలో శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ధర్మశ్రీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కొత్త కార్యవర్గం బార్ సంక్షేమానికి మరింతగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే న్యాయవాదులకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. పార్టీ నాయకులు బొడ్డేడ సూర్యనారాయణ, శరగడం చిమ్మినాయుడు, కురుకూటి భోగేష్ పాల్గొన్నారు.