ఉద్యోగుల డిమాండ్లు తక్షణం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల డిమాండ్లు తక్షణం పరిష్కరించాలి

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి

మహారాణిపేట: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, ఐఆర్‌ వెంటనే మంజూరు చేయాలని, 12వ పీఆర్‌సీ కమిషన్‌ను తక్షణం నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌వో ఎం.విశ్వేశ్వరనాయుడుకు ఉద్యమ కార్యాచరణపై లేఖ అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలను సవరించాల్సి ఉండగా పీఆర్‌సీ కమిటీ ఏర్పాటులో 37 నెలలు జాప్యం జరిగిందన్నారు. మరో 23 నెలల్లో 12వ పీఆర్‌సీ కాలపరిమితి ముగియనున్నందున వెంటనే కమిటీని నియమించాలని కోరారు. పెన్షనర్లకు తగ్గించిన 3 శాతం క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను పునరుద్ధరించాలని, ఉద్యోగుల 26 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

బొప్పరాజుపై ఆరోపణలు ఖండన

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నాగేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement