రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

రావికమతం : గాజువాక సమీపంలో చినగంట్యాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రావికమతం గ్రామానికి చెందిన వృద్ధురాలు కంచిపాటి బంగారమ్మ (62) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మనుమరాలు, భర్తతో కలిసి స్కూటీపై ముగ్గురు వెళ్తుండగా అయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో బంగారమ్మ మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ గాయపడినట్టు ఆమె బంధువులు తెలిపారు. రావికమతం గ్రామానికి బంగారమ్మ గాజువాకలో ఉంటున్న మనవరాలు ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఇంటికి వస్తానని చెప్పడంతో ఆమె రాకకోసం కుమార్తె బంధువులు ఎదురు చూస్తున్నారు. బంగారమ్మ రావికమతంలో చాలా కాలం నుంచి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. గాజువాక నుంచి రావికమతం రావడానికి మనవరాలు, భర్తతో స్కూటీపై వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవార్త తెలిసి స్వగ్రామంలో కుమార్తె, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement