రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Sep 1 2026 12:55 AM | Updated on Sep 1 2026 12:55 AM

సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై న విద్యార్థులు

పాయకరావుపేట : గత నెల 30న మాకవరపాలెంలో జరిగిన సాఫ్ట్‌బాల్‌ ఎంపికల ప్రక్రియలో శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్‌ జూనియర్స్‌ అండర్‌ – 14 బాలుర విభాగంలో బి.సార్ధక్‌ , డి.నంద కిషోర్‌ బాలికల విభాగంలో వి.గీతా ప్రవస్తి, కె.రాఘ వర్షిణి అనకాపల్లి తరపున సెప్టెంబరు 12 నుండి 14 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపికై నట్టు శ్రీ ప్రకాష్‌ విద్యానికేతన్‌ ప్రధానోపాధ్యాయుడు డి.వి.శ్రీనివాస్‌ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సిహెచ్‌.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌, సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి, కోచ్‌ విజయ్‌ అభినందించారు.

ఫుట్‌బాల్‌ చాంపియన్‌ విశాఖ

మైలవరం: ఏపీ ఎఫ్‌ఏ సీనియర్‌ మెన్‌– 2026 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ సోమవారం ముగిసింది. విశాఖపట్నం జట్టు చాంపియన్‌షిప్‌ దక్కించుకోగా, తిరుపతి జట్టు రన్నరప్‌, విజయనగరం జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్‌లో తిరుపతిపై విశాఖపట్నం 2–1తో విజయం సాధించింది. జిల్లా స్థాయి ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఏపీఎఫ్‌ఏ లక్ష్యమని ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్‌ తెలిపారు.

రేపు నల్లగొండలో వైఎస్సార్‌ వర్ధంతి

కొయ్యూరు: మండలంలోని నల్లగొండలో సె ప్టెంబర్‌ 2న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బి. అప్పారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నల్లగొండలో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు. అక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement