అనకాపల్లి: దేశంలో సంచార జాతులను మోదీ ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ద్వారా రుణాలను అందజేయడం జరుగుతుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రొంగలి గోపిశ్రీనివాస్, శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో సంచార జాతుల విముక్తి దివస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంచార జాతులను 1952 ఆగస్టు 31న భారత దేశం గుర్తించడం జరిగిందన్నారు. సంచార జాతులకు ఒక ప్రదేశం ఉండదని, భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం వారు సంచార జాతులవారిని జైల్లో పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల పాలనలో సంచార జాతులను పట్టించుకోలేదన్నారు. సంచార జాతకు ప్రత్యేక సంక్షేమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి పాలనలో సంచార జాతులను గుర్తించి వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. స్వశక్తితో అభివృద్ధి చేందుకు బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లా రమాకుమారి, చొక్కాకుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


