అనకాపల్లి: సత్యసాయి సేవా సంస్థల సేవలు మరింత విస్తృతం చేయాలని ఆ సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. స్థానిక గవరపాలెం గౌరీగ్రంథాలయం ఆవరణలో జిల్లా సత్య సేవా సంస్థల జిల్లా కన్వీనర్లతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యసాయి 101వ జయంతి సందర్భంగా ఈ ఏడాది భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సమితి పరిధిలో మొక్కలను నాటాలన్నారు. నారాయణ సేవ, మెడికల్ క్యాంపులు, దుప్పట్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీన సాయిబాబా శత జయంతి నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు, ప్రతినిధులు కామరాజు, మూర్తి, గౌరీ, విద్యా, బీవీపీ మహేశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు.


