కశింకోట: ఆర్‌ఈసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కశింకోటలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది సెలవు రోజు ఆదివారం కూడా రిలే దీక్షలు నిర్వహించారు. గత నెల నుంచి తమకు నిలిపి వేసిన జీతాలు తక్షణమే ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలు నాల్గో రోజుకి చేరాయి. ఈ సందర్భంగా తమ జీతాలు చెల్లించి, తమకు ఇవ్వాల్సిన సౌకర్యాలు అమలు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని, మరింత తీవ్రతరం చేస్తామని పాలిటెక్నిక్ అధ్యాపక సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు శరగడం హేమంత్ కార్యదర్శి బి. నగేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.


