పశువుల షెడ్డు కాదు.. పాఠశాల | - | Sakshi
Sakshi News home page

పశువుల షెడ్డు కాదు.. పాఠశాల

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

● గూడమాలిపుట్టులో పరిస్థితి దయనీయం

ముంచంగిపుట్టు: చూడగానే పశువుల పాక అనుకుంటే పొరపడినట్టే.. ఇది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాల దుస్థితి. ముంచంగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ గూడమాలిపుట్టు ఎంపీపీ పాఠశాలలో ప్రస్తుతం 33 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు నిర్మించిన చిన్న రేకుల షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. సరైన గోడలు లేకపోవడంతో వెదురుతో తడికలు అల్లి, వాటికి పాత చీరలను అడ్డంగా కట్టారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు పూర్తిగా కారిపోతుండగా, గోడలు లేకపోవడంతో గాలి, ఈదురుగాలులు నేరుగా లోపలికి వస్తున్నాయి. ఇలా అవస్థలు పడుతూనే ఆ చిన్నారులు చదువు కొనసాగిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ’నాడు–నేడు’ రెండో విడత కింద నిధులు మంజూరై పాఠశాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యా యి. భవన నిర్మాణానికి పునాది కోసం గోతులు తవ్వారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయా. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణ సమస్యను పరిష్కరించాలని పెదగూడ మాజీ సర్పంచ్‌ మండి బాబురావుతో పాటు గూడమాలిపుట్టు గ్రామ గిరిజనులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement