భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం

Aug 29 2026 12:52 AM | Updated on Aug 29 2026 12:52 AM

8లో 9లో

నేడు మన్యం రానున్న సీఎం చంద్రబాబు

గత పర్యటనల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్న గిరిజనులు

జీవో నంబర్‌–3 పునరుద్ధరణ, వందశాతం ఉద్యోగాలు, హెల్త్‌ వలంటీర్ల నియామకం కోసం ఎదురుచూపులు

ఇచ్చిన హామీలూ నెరవేరలేదని వంజంగి మహిళల ఆవేదన

హామీలు.. పర్యటనలు.. మళ్లీ హామీలేనా? గతంలో మన్యంలో పర్యటించిన సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ నుంచి ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌

వలంటీర్ల నియామకం వరకు.. వంజంగిలో ఇద్దరు గిరిజన మహిళలకు ఇచ్చిన హామీల వరకూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత హామీలకు పరిష్కారం చూపకుండానే

సీఎం చంద్రబాబు మరోసారి శనివారం మన్యంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అమలుకాని హామీల అంశం చర్చనీయాంశమైంది.

మళ్లీ జిల్లాకు..

హామీల బాబు

సాక్షి, పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మన్యంలో పర్యటించనున్నారు. అరకులోయ మండలం గన్నెల ప్రాంతానికి శనివారం ఆయన రానున్న నేపథ్యంలో.. గతంలో గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుపై చర్చ మొదలైంది. ఇప్పటికే రెండుసార్లు జిల్లాలో పర్యటించిన సీఎం పలు హామీలు ఇచ్చినా.. వాటిలో అనేకం ఇంకా కార్యరూపం దాల్చలేదని గిరిజన సంఘాలు, బాధితులు చెబుతున్నారు. హామీలు ఇచ్చి.. అమలుకు నోచుకోకుండానే మరోసారి పర్యటనకు వస్తున్నారు.. అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అరకు సభలో హామీలు

2024 జనవరి 20న అరకు సభలో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గిరిజనులకు పలు హామీలు ఇచ్చారు. వారికి వందశాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవో నంబర్‌3ను తానే తీసుకొచ్చానని, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పునరుద్ధరిస్తామని.. సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్లను నియమిస్తామని హామీ ఇచ్చారు.

●కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ జరగలేదని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ జీవోపైనా స్పష్టత రాలేదని చెబుతున్నాయి. మెగా డీఎస్సీకి ముందు వందశాతం ఉద్యోగాల కోసం గిరిజన అభ్యర్థులు, ఆదివాసీ ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిస్తున్నాయి.

ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సేవలపై ఆందోళన

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్ల నియామకం చేపట్టకపోవడంతో విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో అనారోగ్య సమస్యలతో 11 మంది గిరిజన విద్యార్థులు మృతిచెందారని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మణికి అందని సాయం

అదే గ్రామానికి చెందిన మరో ఆదివాసీ మహిళ కొమరం మణితోనూ సీఎం మాట్లాడారు. భర్త, ముగ్గురు పిల్లలతో సొంత ఇల్లు కూడా లేని ఆమె పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు.. కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించడంతోపాటు మణి చేస్తున్న టైలరింగ్‌ వృత్తికి అనుగుణంగా దుకాణం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించారు.సీఎం హామీతో తమ కుటుంబ పరిస్థితులు మారుతాయని ఆశించినా.. ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని మణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వంజంగి మహిళలకూ ఎదురుచూపులే

గత ఏడాది ఆగస్టు 9న పాడేరు మండలం వంజంగిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఇద్దరు పేద గిరిజన మహిళలకు పలు హామీలు ఇచ్చారు. వ్యవసాయ కూలీ వంతాల కొండమ్మ ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం.. ఆమెకు పక్కా ఇల్లు నిర్మించడంతోపాటు పాడేరులో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు దుకాణ నిర్మాణం చేపట్టి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అయితే ఏడాది గడిచినా తనకు ఇల్లు, దుకాణ నిర్మాణం జరగలేదని కొండమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు మంజూరైందని అధికారులు చెబుతున్నా.. ఇప్పటివరకు మంజూరు పత్రం కూడా అందలేదని ఆమె పేర్కొంటున్నారు.

ఈసారి ఏం హామీ ఇస్తారో?

ఇలా అరకు సభ నుంచి వంజంగి వరకు గిరిజనులకు ఇచ్చిన పలు హామీలు ఇంకా అమలు కాలేదని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి మన్యంలో పర్యటించనుండటంతో గత హామీలపై ఏం చెబుతారో అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement