ట్రగ్స్‌కు నో చెబితేనే ఆరోగ్యమైన భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రగ్స్‌కు నో చెబితేనే ఆరోగ్యమైన భవిష్యత్‌

Aug 29 2026 12:52 AM | Updated on Aug 29 2026 12:52 AM

● ఐజీ గోపినాథ్‌ జెట్టి

అరకులోయ టౌన్‌: ‘డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన భవిష్యత్‌కు బాటలు వేయండి’ అని విశాఖ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీ) గోపీనాథ్‌ జెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని బట్టివలస పంచాయతీ నందివలస గ్రామంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై గ్రామస్తులకు వివరించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా తామంతా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులకు కూడా ఆపై అవగాహన కల్పిస్తామని గ్రామస్తుల చేత ఐజీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అ మిత్‌ బర్దర్‌, పోలీస్‌ సిబ్బంది, బట్టివలస, నందివలస గ్రామాల గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement