అనకాపల్లి: జిల్లాలో 2026–27 ఏడాదికి గాను రైతులకు వ్యవసాయ పరికరాలను అందించేందుకు ఈనెల 19వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పలేట్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో ఈ–పంట నమోదు ఆధారంగా యంత్రాల మంజూరుకు రూ.266.44 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. ఆన్‌లైన్‌లో నమోదుచేసుకున్న రైతులను ఈనెల 23 నుంచి 25వ తేదీ వరరూ డివిజన్ల వారీగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి, ఆశాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


