● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ని ఆరు మండలాల్లో గ్రామ, వా ర్డు స్థాయి కోర్ కమిటీల నియామక ప్రక్రియ పూ ర్తయిందని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయి కోర్ కమిటీల నిర్మాణం, అనుబంధ విభాగాల వివరాలు ఇప్పటికే తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాయని, వాటికి సంబంధించిన ఐడీ కార్డుల అప్‌లోడింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు. వెరిఫికేషన్ కాని వారు వెంటనే తమ మండల పార్టీ అధ్యక్షులను సంప్రదించి వివరాలను అప్‌లోడ్ చేయించుకోవాలని సూచించారు. ఐడీ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. కార్డుల్లో మార్పులు లేదా చేర్పుల కోసం సంబంధిత మండల పార్టీ అధ్యక్షులను ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రామూర్తి ( అరకులోయ): 91103 34636, పాంగి పరశురాం (డుంబ్రిగుడ)73829 87645, కొర్రా సూర్యనారాయణ (అనంతగిరి) 96669 42471, పాంగి అనిల్ కుమార్ (హుకుంపేట) 63041 77763, చంద్రుబాబు (పెదబయలు)83320 44274, పాంగి పద్మారావు (ముంచంగిపుట్టు)77801 89923. కార్యకర్తలు, నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా ఐడీ కార్డుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.


