ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణం వేగవంతం

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం

గూడెంకొత్తవీఽధి: స్థానికంగా నిర్మిస్తున్న కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆధిత్యవర్మ ఆదేశించారు. గురువారం ఆయన తీములబంద గ్రామంలో అసంపూర్తిగా ఉండిపోయిన ఎకో కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. ప్రభుత్వం తాజాగా ఈకేంద్రం పునఃనిర్మాణానికి రూ.3.50 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో మళ్లీ నిర్మాణ పనులు మొదలయ్యాయి. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈపనులను పీవో పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజీనీరింగ్‌ డీఈ రఘునందనరావు, జేఈ కిషోర్‌, తహసీల్దారు అన్నాజీరావు, ఐటీడీఏ కాఫీ ఏడీ బొంజుబాబు, హెచ్‌వో అరుణకుమారి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement