సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఈఏడాది మే 10,11.12తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ,ఆలయ కమిటీల అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.సోమవారం మోదకొండమ్మతల్లి ఆలయంలో గ్రామపెద్దలు,అన్ని వర్గాల భక్తులు,వర్తకులతో సమావేశం నిర్వహించి, ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల భక్తుల సహకారంతో మోదకొండమ్మతల్లి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.ఈ ఏడాది కూడా ఉత్సవ కమిటీ అధ్యక్ష బాధ్యతను స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు.నూతన కార్యవర్గంలో అన్ని గ్రామాల నుంచి ఉత్సాహవంతులైన భక్తులను సభ్యులుగా నియమిస్తామన్నారు.
నూతన ఉత్సవ కమిటీ
ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,గౌరవ అధ్యక్షులుగా అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు,స్థానిక ఎంపీపీ,పాడేరు సర్పంచ్‌తో పాటు పలాసి కృష్ణారావు,కిల్లు గంగన్నపడాల్, ఉపాధ్యక్షులుగా జంపరంగి ప్రసాద్, కొట్టగుళ్లి సుబ్బారావు,బూరెడ్డి రామునాయుడు, ముఖీ శేషాద్రి,వంతెన్భ రాజబాబు,కొమ్మెజు వెంకటరమణ, డి.పి.రాము,కోటపాడు శ్రీను,వెయ్యాకుల సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శులుగా వర్తన పిన్నయ్యదొర,కూడా సురేష్‌కుమార్,బోనంగి రమణ,భవానీ మధు.ఇమ్మిడిశెట్టి అనీల్‌కుమార్,మాసాడ ఈశ్వరరావు,తమర్భ ప్రసాద్‌నాయుడు,సహాయ కార్యదర్శులుగా బి.కేజీయారాణి,జంపరంగి సత్తిబాబు,జల్లి రాజుబాబు,వంతాల సూరిబాబు,పాంగి మత్స్యకొండబాబు,కూడా సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు


