మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్‌ఫర్‌స్టడీ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్‌లో సోమ వారం ‘గిరిజన యువత సాధికారత – ఉపాధి నైపుణ్యాల శిక్షణ’ అనే అంశంపై ఇండక్షన్ ప్రో గ్రాం నిర్వహించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ ఈ కార్యక్రమాన్ని గతేడాది సెప్టెంబర్ 9న ప్రారంభించారని సెంటర్‌ఫర్ స్టడీ ఆఫ్ సోష ల్ ఇంక్లూజన్ డైరెక్టర్ డాక్టర్ పి.సుబ్బారావు తెలిపారు. ఏయూలోని గిరిజన యువతకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాల కోర్సును స్కిల్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, మెస్సస్ బొల్లినేని మెడ్‌స్కిల్స్ వారి సహకారంతో నిర్వహించామని, కోర్సు వ్యవధి ఒక నెలని పేర్కొన్నారు. కె.ఉషామాధురి సాఫ్ట్ స్కిల్స్‌లో, పి.పద్మలత కమ్యూనికేషన్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చారని చెప్పారు. 21 మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరారని తెలిపారు. ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాలాది రవి మాట్లాడుతూ మెరుగైన ఉపాధి అవకాశాలను పొందేందుకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.


