దాతకు ఘన సన్మానం | - | Sakshi
Sakshi News home page

దాతకు ఘన సన్మానం

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

సీలేరు: స్థానిక శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ధ్యాన మందిరం నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన దాత ప్రదీప్‌ రెడ్డిని ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్‌ రెడ్డి, సీలేరులోని ఈ పురాతన ఆలయ పునర్నిర్మాణ సమయంలో ధ్యాన మందిర నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన తన ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ నేపథ్యంలో, ఆలయ వార్షిక మహోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు వైదారాజు. వీవీ సత్యనారాయణ, శేఖర్‌, సత్యనారాయణ, బాబి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement