జేఏసీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జేఏసీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

పాడేరు: జిల్లా ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్‌. బొంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికలో జిల్లా జేఏసీ చైర్మన్‌గా ఎల్‌. రవీంద్రనాథ్‌ పాత్రుడు, సెక్రటరీగా యు.వి. గిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కో–చైర్మన్లుగా బీఎస్‌ నారాయణ, కె.రఘునాథ్‌, కె. వెంకటరమణ, వైస్‌ చైర్మన్లుగా ఆర్‌.జగన్‌మోహన్‌రావు, ఎస్‌.సంజీవరాజు, ఆర్‌.నాగభూషణరాజు, చిట్టిబాబు, శ్రీరామ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జి. సింహాద్రి, కోశాధికారిగా సుబ్రహ్మణ్యం, జాయింట్‌ సెక్రటరీలుగా చంద్రశేఖర్‌, వరహాలక్ష్మి, వెంకటరమణ, సింహచలం, గురుదొర, రామనాయుడు ఎన్నికయ్యారు.

బాధ్యతగా పనిచేస్తా: రవీంద్రనాథ్‌ పాత్రుడు

నూతనంగా ఎన్నికై న జిల్లా జేఏసీ చైర్మన్‌ ఎల్‌. రవీంద్రనాథ్‌ పాత్రుడు మాట్లాడుతూ.. సభ్యులందరూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన కార్యవర్గ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement