ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

Feb 16 2026 7:45 AM | Updated on Feb 16 2026 7:45 AM

ఆటో బ

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

క్షతగాత్రులు గోవింద్‌, వంతాల విజయశాంతికి వైద్యం అందిస్తున్న సిబ్బంది

పెదబయలు: మండలంలోని సీకరి పంచాయతీ పన్నెడ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని, లక్ష్మీపేట పంచాయతీ కుడాసింగి, ముంచంగిపుట్టు గ్రామాలకు చెందిన భక్తులు మత్స్యగుండం ఆలయాన్ని సందర్శించుకున్నారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, పన్నెడ సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కుడాసింగి గ్రామానికి చెందిన పలువురు గాయపడ్డారు. వంతాల విజయశాంతికి ఎడమ చేయి, కాలుకు గాయాలయ్యాయి.లకే సూరిబాబు తలకు తీవ్ర గాయమైంది. తమడ్ల రంజిత్‌కు నడుము భాగంలో దెబ్బ తగిలింది. పేటమాలిపుట్టుకు చెందిన వంతాల గోవింద్‌ ఎడమ కాలికి గాయమైంది. వీరితో పాటు ఆటోలో మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో చిన్న పిల్లలు, చంటిబిడ్డలతో కలిపి సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ పిల్లలెవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు.ఇలావుండగా ఇటీవల ఆర్‌అండ్‌బీ రోడ్డు పనుల వల్ల రహదారిపై మెటల్‌ తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నెమ్మదిగానే వెళ్తున్నప్పటికీ, రోడ్డు సరిగా లేకపోవడంతోనే అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు1
1/3

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు2
2/3

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు3
3/3

ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement