ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

Feb 13 2026 3:35 AM | Updated on Feb 13 2026 3:35 AM

ఆశ్రమ

ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఉత్తర్వులు

బంగారుమెట్ట పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంపై చర్యలు

ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను గురువారం పాడేరు ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తరగతి గదులను సందర్శించిన పీవో, విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. పాఠశాలలో అందుతున్న వసతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యాబోధన తీరుపై ఆరా తీశారు.విద్యార్థినులకు పాఠాలు సరిగ్గా అర్థం కావడం లేదని, బోధన సక్రమంగా సాగడం లేదని ఆమె పరిశీలనలో తేలింది. విద్యా ప్రమాణాల నిర్వహణలో పాఠశాల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆమె గుర్తించారు. పాఠశాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్‌ చేస్తూ పీవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉంది. బోధనలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మిగిలిన ఉపాధ్యాయులందరినీ ఆమె తీవ్రంగా మందలించారు. పనితీరులో తక్షణమే మార్పు రాకపోతే బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌1
1/2

ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌2
2/2

ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement