వంద కిలోల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

వంద కిలోల గంజాయి పట్టివేత

Feb 13 2026 3:35 AM | Updated on Feb 13 2026 3:35 AM

వంద క

వంద కిలోల గంజాయి పట్టివేత

సీలేరు: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. గురువారం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒడిశా నుంచి వస్తున్న ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కారులో దాచిన గంజాయిని గుర్తించినట్లు ఎస్‌ఐ యాసిన్‌ తెలిపారు. ఈ దాడిలో వంద కిలోల గంజాయితో పాటు, దానికి సంబంధమున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు పల్నాడు జిల్లాకు చెందిన సప్పరాపు గోపి, మారిబోయిన వెంకటేశ్వర్లు, కొమ్మడిగుంట అనిల్‌ అని పోలీసులు గుర్తించారు.

24 కిలోలతో మరొకరు..

గూడెంకొత్తవీధి: ఒడిశా నుంచి పట్టణ ప్రాంతానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ సురేష్‌ గురువారం తెలిపారు. రామచంద్రపురం ప్రాంతానికి చెందిన కొగురు రామ్‌తేజ, ఒడిశాలోని చిత్రకొండ వద్ద 24 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. తన స్నేహితునితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. రామ్‌తేజ పట్టుబడగా, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని, పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ అధికారులు లింగాలు, నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సీలేరులో ముగ్గురి అరెస్టు

వంద కిలోల గంజాయి పట్టివేత 1
1/1

వంద కిలోల గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement