సంప్రదాయ విత్తనాలతో జన్యు వనరుల పరిరక్షణ | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయ విత్తనాలతో జన్యు వనరుల పరిరక్షణ

Jan 30 2026 4:13 AM | Updated on Jan 30 2026 4:13 AM

సంప్రదాయ విత్తనాలతో జన్యు వనరుల పరిరక్షణ

సంప్రదాయ విత్తనాలతో జన్యు వనరుల పరిరక్షణ

ఎన్‌బీపీజీఆర్‌ డైరెక్టర్‌ శ్రావణ్‌

సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ విత్తనాలను ప్రోత్సహించడం ద్వారా జన్యు వనరుల పరిరక్షణ సాధ్యమవుతుందని జాతీయ మొక్కల జన్యువనరుల బ్యూరో ప్రాంతీయ స్థానం ( ఎన్‌బీపీజీఆర్‌, హైదరాబాద్‌) డైరెక్టర్‌ శ్రావణ్‌ తెలిపారు. సంజీవని సంస్థ వ్యవస్థాపకుడు దేముళ్లు ఆధ్వర్యంలో డి.గొందూరు పంచాయతీ కేంద్రంలో గురువారం జన్యు వనరుల పరిరక్షణపై గిరిజన రైతులకు సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1993కు ముందు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో పండించిన పంటలను,ఆయా సాంప్రదాయ విత్తనాలను మరో దేశానికి ఎగుమతి,దిగుమతులు చేసుకోవడం జరిగేదన్నారు. తద్వారా జన్యువుల సేకరణ, వినియోగంపై ఆంక్షలు ఉండేవి కావన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశంలో సాగయ్యే పంటల జన్యువనరులను ఇతర దేశాలకు తరలించడం రైతుల అనుమతి లేనిదే సాధ్యం కాకపోవడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. దేశంలో పంటలు, ఆయా విత్తనాలపై సర్వహక్కులు ఏర్పడ్డాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సంప్రదాయ విత్తనాలను సంరక్షించాలన్నారు. సిరుకందులు.పెద్దకందులు, కొండకంది,చిన్నసామ,పెద్దసామ, బొబ్బర్లు, తిమ్మిరెలు వంటి ఆహార పంటలు అంతరించి పోయే స్థితిలో ఉన్నాయన్నారు. వీటిని పరిరక్షించి భావితరాలకు అందించే బాధ్యత గిరిజన రైతులపై ఉందన్నారు.అనంతరం సంప్రదాయ విత్తనాల పరిరక్షణ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌వైఎస్‌ఎస్‌ డైరెక్టర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ తమర్భ బాబురావునాయుడు, ఆదివాసీ మిత్ర సంస్థ ప్రతినిధి మన్మథరావు, డి.గొందూరు సర్పంచ్‌ సీదరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement